Header Banner

అతి తక్కువ ధరలో కొత్త కారు.. 2025 మోడల్ లో పలు ఆధునిక ఫీచర్లు! సరికొత్తగా హోండా అమేజ్..

  Sun Feb 02, 2025 17:18        Politics

జపనీస్ కార్ల తయారీ దిగ్గజం హోండా భారత మార్కెట్లో తన కార్లకు కొత్త సొగసులు అద్దుతోంది. ఇప్పటికే తన సిటీ కారుకు అపెక్స్ వెర్షన్ ప్రకటించిన హోండా కార్స్ ఇండియా ఆ కారును ఇటీవలే ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించింది. అదే వరుసలో తన అమేజ్ మోడల్ కారుకు కూడా హోండా కొత్త వెర్షన్ ను తీసుకువస్తోంది. ఇది అమేజ్ కారుకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ టీరియర్స్, ఇంటీరియర్స్ ను ఆధునికీకరించారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ సీవీటీ ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. ఇంజిన్ కెపాసిటీ 1,199 సీసీ కాగా... సాధారణ పరిస్థితుల్లో లీటర్ కు 19.46 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా ప్రకటించింది. అమేజ్ కారులోనూ హోండా తన ఐకానిక్ ఐ-వీటెక్ ఇంజిన్ ను అమర్చింది. సిటీ కారు తరహాలోనే ఇందులోనూ 7 రంగులతో రిథమిక్ యాంబియెంట్ లైటింగ్ థీమ్స్ ను చూడొచ్చు.

 

ఇంకా చదవండి: 2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

హోండా సిటీ కారు ముందు భాగంలో ఉండే లేన్ వాచ్ కెమెరా... రోడ్డుపై ముందు వెళ్లే వాహనాలను గుర్తించి డ్రైవర్ ను అప్రమత్తం చేస్తుంది. ఇందుకోసం హోండా సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించారు. అడాస్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఇన్ఫోటైన్ మెంట్ కోసం 8 అంగుళులా హెచ్ డీ డిస్ ప్లే పొందుపరిచారు. వైర్ లెస్ ఫోన్ చార్జర్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ కనెక్టివిటీ కోసం ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లతో హోండా అమేజ్ ఆల్ న్యూ వెర్షన్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7,99,000 (ఎక్స్ షోరూమ్) అని కంపెనీ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఇందులో టాప్ వేరియంట్ జడ్ఎక్స్ మోడల్ ధర రూ.9.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) అని హోండా కార్స్ ఇండియా వెల్లడించింది.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HondaAmaze #FaceLift #AllNewVersion #India